‘‘మొక్కజొన్న చేనుకు మోడీ కాపలా!’’ అవునండీ.. మీరు చదివింది నిజమే.. మొక్కజొన్న పంటకు కాపలాగా భారత ప్రధాన మంత్రి ఉన్నట్టున్నారు!.. భారత ప్రధాన మంత్రి కటౌట్ ను మొక్క జొన్న పంటకు రక్షణగా ఉండేలా అమర్చారు ఓ రైతు.
oplus_0
బీజేపీ జెండాలతో పాటు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కటౌట్‌లను ఓ అన్నదాత తన మొక్కజొన్న పంటక్షేత్రంలో మూడు వైపులా పెట్టుకున్నారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కొత్తపల్లిగోరి మండల పరిధిలోని చిన్నకోడెపాక గ్రామానికి చెందిన ఓ రైతు తన వ్యవసాయ భూమిలో మొక్కొజొన్న సాగు వేశాడు.
oplus_0
ఈ క్రమంలో పంట రక్షణకు కోతులు, ఇతర జంతువుల నుంచి రక్షణకు గానూ మూడు వైపులా బీజేజీ కాషాయ జెండాలతో పాటు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఫొటోలను కటౌట్ గా పెట్టారు. దీంతో అటు వైపుగా ఆ దారి గుండా వెళ్లే వారు, ప్రజలు ఆసక్తిగా తిలకిస్తున్నారు.
oplus_0
ఈ రైతు ఐడియా అదుర్స్ అని కొందరు అంటున్నారు. ఏకంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీనే పంటకు రక్షణగా నిలుస్తున్నట్టు చక్కటి కటౌట్ లను పెట్టారని కొందరు రైతులు పేర్కొంటున్నారు.
వాహ్.. వాట్ యాన్ ఐడియా ఫార్మర్ జీ అని మరి కొందరు ముక్కున వేలేసుకుంటూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా పంటకు రక్షణ కవచంలాగా ప్రధాని నరేంద్ర మోడీ కటౌట్ లు ఉండటం ఒకరకంగా సంచలనమేనని ఇంకొందరు సరదాగా కామెంట్స్ చేస్తున్నారు.