- ఘోర ప్రమాదం.. ఆటోపై నుంచి దూసుకెళ్లిన లారీ
వేద న్యూస్, వనపర్తి:
వనపర్తి జిల్లాలో ఆటోను లారీ ఢీకొట్టడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. పెద్దల పండగ సందర్భంగా పొట్టేళ్లను తీసుకొని వెళ్తుండగా నాసనాల్లి సమీపంలో ఆటో అదుపుతప్పి బోల్తా పడింది.
అదే సమయంలో ఎదురుగా వచ్చిన లారీ ఆటోపై నుంచి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ రాజు(38), వ్యాపారి రవి(35) చనిపోగా రవి భార్య ఆటోలో నుంచి పడిపోవడంతో ప్రాణాలతో బయటపడింది. ఈ ప్రమాదపు సీసీటీవీ ఫుటేజీ సోషల్ మీడియాలో ఫుల్ వైరలవుతోంది.