వేదన్యూస్ వరంగల్
వరంగల్ జిల్లా ఆజంజాహి మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ SHO (స్టేషన్ హౌస్ ఆఫీసర్) గా ఈరోజు విధుల్లో చేరి అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు.
శాంతిభద్రతల పరిరక్షణకు పెద్దపీట వేస్తూ, ప్రజల ఫిర్యాదులపై తక్షణమే స్పందిస్తూ పారదర్శకమైన పోలీసింగ్ అందించడమే తన ముందున్న ప్రధాన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. నేరాల నియంత్రణలో సుదీర్ఘ అనుభవం ఉన్న ఆయన రాకతో స్థానికంగా నేరస్తుల ఆటకట్టించడంతో పాటు చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపుతారని స్థానికులు భావిస్తున్నారు.
అంతకుముందు ఆదిలాబాద్ జిల్లా మావల పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్గా తనదైన శైలిలో విధులు నిర్వర్తించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.
