ఆధునిక మౌలిక సదుపాయాలతో పోలీస్ శాఖ మరింత పటిష్టం.*
వేద న్యూస్ ,వీర్నపల్లి:
ప్రజల భద్రత,శాంతి భద్రతల పరిరక్షణను మరింత బలోపేతం చేయడానికి నూతనంగా ఏర్పాటు చేసిన వీర్నపల్లి పోలీస్ స్టేషన్ భవన కోసం రెవెన్యూశాఖ నుండి పోలీస్ శాఖకు స్థలం కేటాయించగా అట్టి స్థలంలో భూమి పూజ కార్యకమనికి ముఖ్య అతిథులుగా హాజరైన ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఎస్పీ మహేష్ బి గీతే.ఈసందర్భంగాకలెక్టర్ మాట్లాడుతూ.. వీర్నపల్లి లో రెండు ఎకరాలలో నూతన పోలీస్ స్టేషన్ భవనం కోసం రెవెన్యూశాఖ నుండి పోలీస్ శాఖకు కేటాయించడం జరిగిందని తెలిపారు.జిల్లా కేంద్రానికి దూరంగా ఉన్న ప్రాంతం వీర్నపల్లి అని, ఈప్రాంతాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేయడం యంత్రాంగం భాధ్యత అని అన్నారు.పేద ప్రజలకు న్యాయం చేకూర్చేలా పోలీసులుబాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని కోరారు.ఎస్పీమాట్లాడుతూ.ఆధునిక సాంకేతికతను వినియోగించుకోని ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో పోలీసు శాఖ ముందంజలోఉందన్నారు.పోలీసు వ్యవస్థలో అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పిస్తూ మెరుగైన భద్రత వ్యవస్థను నెలకొల్పడం జరుగుతుందని,శాంతి భద్రతల ఎక్కడ అదుపులో ఉంటాయో అక్కడ అభివృద్ధి సాధ్యమని జిల్లా ఎస్పీ అన్నారు.శాంతిభద్రతలను పర్యవేక్షించడంలో భాగస్వామ్యమై ప్రజలకు మరింత రక్షణగా ఉంటూ వీర్నపల్లి మండల ప్రజలకు పోలీస్ సేవలు మరింత చేరువ చేయాలనే ఉద్దేశ్యంతో మండల కేంద్రంలో నూతన హంగులతో పోలీస్ స్టేషన్ భవనం కోసం రెవెన్యూశాఖ నుండి పోలీస్ శాఖకు కేటాయించిన స్థలంలో భూమి పూజ చేసుకోవడం జరిగిందన్నారు.ఈకార్యక్రమంలో కె. కె మహేందర్ రెడ్డి, సి.ఐ శ్రీనివాస్,ఎస్.ఐ లు లక్ష్మణ్,రమాకాంత్, ఎల్లగౌడ్, రాహుల్ రెడ్డి,ఏఎంసీ చైర్మెన్ రాములు నాయక్, సెస్ డైరెక్టర్.మల్లేశం,ప్రజాప్రతినిధులు,పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.