= జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే
వేద న్యూస్, రాజన్న సిరిసిల్ల:
జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణలో సివిల్ పోలీసులతో పాటు ఆర్ముడ్ రిజర్వ్ పోలీస్ విభాగం కూడా కీలక పాత్ర పోషిస్తున్నదని జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే తెలిపారు. సాయుధ దళాల వార్షిక పునర్ ఉచ్చరణ (మోబిలైజేషన్) ముగింపు కార్యక్రమంలో భాగంగా పరేడ్ మైదానంలో నిర్వహించిన సాయుధ దళాల సమీకరణ కవాతు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా పోలీస్ అధికారులు, సిబ్బంది తమ వృత్తి నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలని సూచించారు. వార్షిక మోబిలైజేషన్ శిక్షణలో భాగంగా ఆర్మ్స్ డ్రిల్, లాఠీ డ్రిల్, ఫుట్ డ్రిల్, సెర్మొనియల్ డ్రిల్, గార్డ్ మౌంటింగ్, మాబ్ ఆపరేషన్, ఫైరింగ్, నాకబంది, పికెట్స్, వీఐపీ బందోబస్త్ విధులు, ప్రిసనర్ మరియు క్యాష్ ఎస్కార్ట్ వంటి అంశాలపై శిక్షణ అందించినట్లు తెలిపారు. పోలీసులు తమ శారీరక దారుఢ్యాన్ని కాపాడుకుంటూ విధుల్లో నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలని ఎస్పీ సూచించారు. అనంతరం సార్ధపూర్ బెటాలియన్ ఫైరింగ్ రేంజ్‌లో నిర్వహించిన ఫైరింగ్ శిక్షణను ఎస్పీ పర్యవేక్షించి స్వయంగా ఫైరింగ్ ప్రాక్టీస్ కూడా చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ చంద్రయ్య, ఆర్.ఐలు, ఎస్.ఐలు, పోలీస్ సిబ్బంది