వేద న్యూస్, టేక్మాల్:
పోస్టల్ బ్యాలెట్ ను ఎన్నికల్లో పోలింగ్ విధులు నిర్వహించే సిబ్బంది, సర్వీస్ ఓటర్లు ఉపయోగించుకోవలని జిల్లా కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ స్పష్టం చేశారు. టేక్మాల్ ఎంపీడీవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోస్టల్ బ్యాలెట్ కేంద్రాన్ని సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ ఈ నెల 11వ తేదీన పోలింగ్ జరుగనున్న నేపధ్యంలో విధులు నిర్వహించే సిబ్బంది పోస్టల్ బ్యాలెట్ల ఓటింగ్ ఏర్పాట్లను పరిశీలించి సమర్థ నిర్వహణకు తగు సూచనలు సలహాలు అందించారు ఎన్నికల విధులు నిర్వహించేవారు. సర్వీస్ ఓటర్లు పోస్టల్ బ్యాలెట్ ను ఉపయోగించుకోవాలని తెలిపారు. పోస్టల్ బ్యాలెట్ కేంద్రంలో ఎలాంటి అసౌకర్యాలు కలిగించకుండా పోస్టల్ బ్యాలెట్ కోసం వచ్చే వారిని ప్రశాంతమైన వాతావరణంలో పోస్టల్ బ్యాలెట్ జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అధికారుల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.