వేద న్యూస్, ముస్తాబాద్:
రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడిగా గూడెం గ్రామానికి చెందిన బొప్ప నరసయ్యను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సంఘం సమావేశంలో సభ్యుల సమక్షంలో నూతన కమిటీని ప్రకటించారు. ఈ సందర్భంగా ప్రధాన కార్యదర్శిగా తోట ధర్మేందర్, ఉపాధ్యక్షులుగా కుక్కల దేవేందర్, మెంగని శ్రీనివాస్, కోశాధికారిగా ఆది లక్ష్మణ్‌లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సమావేశంలో మాజీ మండల అధ్యక్షుడు మెంగని రాజు, వివిధ గ్రామాల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు పాల్గొన్నారు. అలాగే మున్నూరు కాపు సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి మెంగని మనోహర్, రాష్ట్ర నాయకులు శీలం స్వామి, జిలేల్లా మల్లేశం, మాజీ ఎంపీటీసీ బొప్ప శ్రీధర్, చెక్కపల్లి రాజు, బండి ఎల్లం, కొండాపూర్ శ్రీనివాస్, బండి రాములు, మొర్రెపల్లి సర్పంచ్ మెంగని శ్రీనివాస్, శీలం సుధాకర్, వరాల లక్ష్మీనారాయణ, బొప్ప శంకర్, వరుస సత్యం, దబ్బేడా రాములు, వరి లక్ష్మణ్, బొప్ప విష్ణు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *