వేద న్యూస్, గంభీరావుపేట:

రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కేంద్రం రైతులకు యూరియా కష్టాలు తీరడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

పీఏసీఎస్ ఎదుట ఉదయం నాలుగు గంటల నుండి యూరియా కోసం నిలుచున్న మండల కేంద్రానికి చెందిన మల్లయ్య.. యూరియా ఇస్తున్నారని తెలిసి వచ్చి లైన్లో నిలబడ్డారు. ఒక్కసారిగా ఫిట్స్ రావడంతో కింద పడిపోయాడు. వెంటనే అక్కడే ఉన్న రైతులు ప్రథమ చికిత్స చేయగా, కుటుంబ సభ్యులు ఇంటికి తీసుకొని వెళ్లారు.