వేద న్యూస్,బోయినిపల్లి:
రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం రత్నంపేట గ్రామంలో గ్రామ ప్రజల సమక్షంలో డాక్టర్ బి.ఆర్ బాబా సాహెబ్ అంబేద్కర్, వర్ధంతి సందర్భంగా ఎంతో ఘనంగా ఆయన స్మరించుకొని భారత రాజ్యాంగ స్ఫూర్తిదాత, నవ భారత నిర్మాణ కర్త, అయినటువంటి గొప్ప ప్రపంచ మేధావి అయినటువంటి అంబేద్కర్,కి నివాళులర్పించారు. భారతదేశంలో చూసుకుంటే ఒకవైపు మతోన్మాదం, పెంచి పోషిస్తూ, భారత రాజ్యాంగానికి తూట్లు పొడిచే విధంగా, కుల వివక్ష, అంటరానితనం, పెంచి పోషించే విధంగా కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం మతోన్మాదులను పెంచి పోషిస్తుంది. ఈ క్రమంలో యావత్ ప్రజానీకం భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని పిలుపునిస్తూ ఈ జరగబోయే స్థానిక సంస్థల సర్పంచి ఎన్నికల్లో గ్రామ సమస్యల పట్ల అవగాహన ఉన్న వ్యక్తిని, నీతి నిజాయితీగా వ్యవరించే వ్యక్తిని, గ్రామాన్ని అభివృద్ధిపరిచే వ్యక్తిని ఎన్నుకోవాలని డబ్బుకు, మద్యానికి, ఓటును అమ్ముకుని మన భవిష్యత్తు, మన గ్రామ భవిష్యత్తును, అంధకారం చేసుకోవద్దని నిజాయితీ గల వ్యక్తిని ఎన్నుకోవాలని పిలుపునివ్వడం జరుగుతుంది.ఈ కార్యక్రమంలో మండల సిపిఎం పార్టీ కన్వీనర్ గురిజాల శ్రీధర్, జిల్లా రైతు సంఘం అధ్యక్షులు రామంచ అశోక్, చిలువేని రాజు,మర శ్రీకాంత్, మర రంజిత్ కుమార్, ర్యాగల లచ్చయ్య, ఇటిక్యాల వీరేశం, గడ్డి మైపాల్, తదితరులు పాల్గొన్నారు.