వేద న్యూస్, మరిపెడ:
మరిపెడ మున్సిపాలిటీ పరిధిలోని మాకుల తండాకు చెందిన ఇస్లావత్ సురేష్ ఇటీవల మృతి చెందారు. విషయం తెలుసుకున్న డోర్నకల్ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత డీఎస్ రెడ్యా నాయక్ మంగళవారం అక్కడికి వచ్చారు. కీ.శే. సురేశ్ ఇస్లావత్ చిచిత్రపటం వద్ద శ్రద్ధాంజలి ఘటించి నివాళులర్పించి, కుటుంబ సభ్యులను ఓదార్చారు.
రెడ్యానాయక్ వెంట మహబూబాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ గుడిపుడి నవీన్, గులాబీ పార్టీ నాయకులు గుగులోతు వెంకన్న, తేజావత్ రవీందర్ , షేక్ లతీఫ్, జరుపుల బాలాజీ , పానుగోతి వెంకన్న, లూనావత్ వెంకన్న, బానోతు శ్రీను,పేపర్ శ్రీను, జాటోత్ గణేష్, బోడ రెడ్డి తదితరులున్నారు.