వేదన్యూస్ – మంగళగిరి
ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ ఫలితాలను మంత్రి నారా లోకేశ్ ఈరోజు శనివారం విడుదల చేశారు.ఈ రోజు ఉదయం పదకొండు గంటలకు ఇంటర్ ప్రథమ . ద్వితీయ సంవత్సర ఫలితాలను ఆయన విడుదల చేశారు. https://resultsbie.ap.gov.in/ అనే వెబ్ సైట్ ద్వారా ఫలితాలను తెలుస్కోవచ్చు అని మంత్రి విద్యార్థులకు సూచించారు.
మరోవైపు 9552300009 అనే మనమిత్ర వాట్సాప్ నంబరు ద్వారా కూడా కేవలం రెండే రెండు నిమిషాల్లో ఫలితాలను తెలుస్కోవచ్చు అని అన్నారు.
ఈసందర్భంగా ఇంటర్మీడియట్ లో ఉత్తీర్ణులైన విద్యార్థులను మంత్రి అభినందించారు. ఉత్తీర్ణులు కానీవారు కంగారు పడాల్సిన పని లేదు సప్లై రాసుకోవచ్చు.. జీవితాలను మార్చుకోవచ్చు అని సూచించారు.