వేద న్యూస్, వరంగల్ టౌన్:
వరంగల్ హైదరాబాద్ నేషనల్ హైవే లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా మరొకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది.
గురువారం వరంగల్ నుండి హైదరాబాద్ కు ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులను కారు ఢీ కొట్టడంతో ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు.
మరొకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మృతి చెందిన వ్యక్తి రాపాక వినోద్ కుమార్, తీవ్ర గాయాలైన వ్యక్తి బిర్రు రవిగా వీరి స్వస్థలం వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలంగా గుర్తించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.