•  ఎం రోహిత్‌రావు ఆహ్వానం మేరకు..
  •  కరీంనగర్, హుజూరాబాద్ అభివృద్ధి‌పై చర్చ

వేద న్యూస్, హుజూరాబాద్:
ప్రముఖ సామాజికవేత్త, మల్టీ నేషనల్(ఐటీ) కంపెనీ ‘జెన్‌ప్యాక్ట్’ గ్లోబల్ వైస్ ప్రెసిడెంట్ సబ్బని వెంకట్‌ శుక్రవారం ‘కెరీర్ కన్సల్ట్జ్’ కంపెనీని సందర్శించారు. కరీంనగర్ జిల్లా సీనియర్ కాంగ్రెస్ నాయకుడు దివంగత ఎం.సత్యనారాయణ రావు (ఎంఎస్ఆర్) మనవడు మేనేని రోహిత్ రావు ఆహ్వానం మేరకు వారి కంపెనీని వెంకట్ సందర్శించారు.

హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని వారి కంపెనీని సబ్బని విజిట్ చేశారు. కెరీర్ కన్సల్ట్జ్ ఫౌండర్, సీఈవో మెన్నేని రోహిత్ ఆతిథ్యం స్వీకరించిన వెంకట్.. అనంతరం మెన్నేని రోహిత్‌తో సమావేశమయ్యారు.ఈ సమావేశంలో పలు రాజకీయ, వ్యక్తిగత అంశాలపై డిస్కషన్ జరిగినట్టు తెలిసింది.

యువతకు ఉపాధి అవకాశాల కల్పన పైన చర్చ చేసినట్టు వినికిడి. కరీంనగర్, హుజూరాబాద్ నియోజవర్గ అభివృద్ధి‌పై,యువత రాజకీయాల్లోకి రావడానికి, తీసుకురావడానికి నాయకుల పాత్ర పై కూలంకుషమైన విశ్లేషణ చేసినట్టు సమాచారం.

అభివృద్ధి ఎజెండాగా డిస్కషన్!
కరీంనగర్, హుజూరాబాద్ ప్రజలకు సంబంధించిన అంశాలతో పాటు సమగ్ర అభివృద్ధిపైన పలు అంశాలను చర్చించినట్టు తెలుస్తోంది. సేవావాది, యువవాదిగా పేరు గాంచిని సబ్బని వెంకట్ పలు విషయాలను చర్చించినట్టు సమాచారం.

కరీంనగర్‌తో పాటు హుజూరాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్‌కు సంబంధించిన సమగ్ర అభివృద్ధిపై ఇప్పటికే పలు విషయాలను సబ్బని వెంకట్ పలు సందర్భాల్లో ప్రస్తావిస్తున్న సంగతి తెలిసిందే.

కాగా, తమ ఆహ్వానం మేరకు కంపెనీని సందర్శించిన సబ్బని వెంకట్‌ను రోహిత్‌రావు శాలువాతో ఘనంగా సత్కరించారు. సబ్బని వెంకట్ వెంట ఆయన టీమ్ సభ్యులున్నారు.