- చూసీ చూడనట్టుగా సంబంధిత శాఖ అధికారులు?
వేద న్యూస్,ఇల్లంతకుంట:
రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం కందికట్కూర్ గ్రామంలో శ్రీ రాజరాజేశ్వర జలాశయం గేట్ల సమీపం నుండి, ఇసుక తవ్వకాలు జరిపి రవాణా చేస్తున్నారు. దీనివలన భవిష్యత్తులో జలాశయ గేట్లకు ప్రమాదం పొంచి ఉంటుంది కదా!.అసలు మిడ్ మానేరు గేట్లకు ఎన్ని మీటర్ల దూరంలో ఇసుక తవ్వకాలకు పరిమిషన్ ఇవ్వాలో సంబంధిత శాఖ అధికారులకు తెలియదా? అని జనం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కందికట్కూర్ గ్రామంలో శ్రీ రేణుక ఎల్లమ్మ దేవాలయం వద్దకు నిత్యం దైవ దర్శనానికి భక్తులు వస్తుంటారు.అంతేగాకుండా పుణ్య స్నానాలు కోసం చుట్టుపక్కల ప్రాంతాలలో నుండి కూడా భక్తులు వస్తారు. గతంలో సుమారు ఒక ఆరుగురు భక్తులు మిడ్ మానేరు నదిలో చనిపోయారు.దీనికి కారణం అక్కడ ఇసుక తవ్వకాలు జరపడం వల్ల వచ్చిన వారికి లోతు తెలియక అందులో మునిగి మృతి చెందుతున్నారు.
ఈ విషయమును సంబంధిత శాఖ అధికారులకు ఎన్ని సార్లు చెప్పిన కూడ వారు చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారు.గతంలో ఎంత మంది తహసీల్దారులు వచ్చిన కూడా ఇక్కడ ఇసుక తవ్వకాలకు పర్మిషన్ ఇవ్వలేదు.
కానీ, ప్రస్తుతం ఉన్న తహసిల్దార్ ఇందిరమ్మ ఇండ్ల పేర్లు చెప్పుకుంటూ, ఇసుక ట్రాక్టర్ లకు పర్మిషన్ లు ఇస్తున్నారు. ప్రజలు అడిగితే ఏ కేవలం కందికట్కూర్ గ్రామ ప్రజల అవసరాల వరకే పర్మిషన్ ఇస్తున్నారు అని చెప్తున్నారు. అయితే, కందికట్కూర్ గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లు పూర్తి అయిన కూడా పర్మిషన్ తీసుకొని మండలంలోని ఇతర గ్రామాలకు తరలిస్తున్నారు.
ఆ గ్రామం పేరు చెప్పి ఇతర గ్రామాలకు ఇసుక రవాణా చేయడం ఎంతవరకు సమంజసమని గ్రామ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఈ విషయంపై తక్షణమే పై అధికారులు స్పందించాలని కోరుతున్నారు. ఇసుక తవ్వకాలను పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోని,గ్రామ పరిధిలో ఇసుక తవ్వకాలు జరపకుండా చూసి, ఇసుక తవ్వకాల వలన అటు ప్రాజెక్టుకు గ్రామ ప్రజలకు ఎటువంటి హాని జరగకుండా చూడాలని యావత్ గ్రామ ప్రజలు కోరుతున్నారు.
