వేద న్యూస్, ఎల్కతుర్తి:
ఎల్కతుర్తి ఏఎంసీ(అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ) చైర్మన్‌గా కాంగ్రెస్
సీనియర్ నేత, మాజీ మండల అధ్యక్షుడు సుకినె సంతాజీ నియమితులయ్యారు. ఈ
మేరకు వ్యవసాయ, సహకార శాఖ నుంచి అధికారిక ఉత్తర్వులు శనివారం
విడుదలయ్యాయి. వైస్ చైర్మన్‌గా బొక్కల స్రవంతి శ్రీనివాస్ రెడ్డిని
నియమించారు. 

సుకినె సంతాజీ చైర్మన్‌గా వైస్ చైర్మన్‌తో కలిపి 13 మంది
సభ్యులను అపాయింట్ చేశారు. సభ్యులుగా జి కొమురయ్య, ఎం జగన్, షేక్ హక్కీం

పాషా, జే వెంకటస్వామి, ఆర్ మొండయ్య, జి రాజయ్య, దాట్ల ప్రవీణ్, ఎం
రాజయ్య, బండి సుధాకర్ నియమితులయ్యారు.

పీఏసీఎస్ చైర్మన్ , డిస్ట్రిక్ట్ మార్కెటింగ్ ఆఫీసర్, అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్, ఎల్కతుర్తి జీపీ స్పెషల్ ఆఫీసర్ ఏఎంసీలో సభ్యులుగా ఉంటారు. కాగా, కాంగ్రెస్ నేత
సుకినె సంతాజీని ఏఎంసీ చైర్మన్ గా నియమించడం పట్ల కాంగ్రెస్ శ్రేణులు
హర్షం వ్యక్తం చేశాయి. నేతలు, కార్యకర్తలు స్థానిక ఎమ్మెల్యే, మంత్రి
పొన్నం ప్రభాకర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.