• రైతులకు ఎప్పుడు అందుబాటులో ఉంటా..
  • రైతు ప్రయోజనాలే ధ్యేయంగా పని చేస్తా: ఏఎంసీ చైర్మన్

వేద న్యూస్, ఎల్కతుర్తి:

ఎల్కతుర్తి కేంద్రంగా నూతనంగా ఏర్పడిన వ్యవసాయ మార్కెట్ కమిటీ తొలి పాలకవర్గం బుధవారం ప్రమాణస్వీకారం చేసింది. చైర్మన్ గా ఎల్కతుర్తి మండలం చింతలపల్లి గ్రామానికి చెందిన సుకినే సంతాజి, వైస్ చైర్ పర్సన్ గా భీమదేవరపల్లి మండలం ముస్తాపూర్ కు చెందిన బొక్కల స్రవంతి, డైరెక్టర్లుగా కేశవాపూర్ గ్రామానికి చెందిన అబ్బానవేన రాజయ్య, ఎల్కతుర్తి గ్రామానికి చెందిన గొడిశాల రాజయ్య, పెంచికలపేట గ్రామానికి చెందిన దాట్ల ప్రవీణ్, సూరారం గ్రామానికి చెందిన బచ్చు బాపురావు, దామెర గ్రామానికి చెందిన మంతుర్తి రాజయ్య, ముల్కనూరు గ్రామానికి చెందిన గణబోయిన కొమురయ్య, వంగర గ్రామానికి చెందిన రామోజు మొండయ్య, కొత్తకొండ గ్రామానికి చెందిన జోడుముంతల వెంకటస్వామి, ముల్కనూరు గ్రామానికి చెందిన షేక్ హకీమ్ పాషా, ఎర్రబెల్లి గ్రామానికి చెందిన మాలోతు జగన్, జీలుగుల గ్రామానికి చెందిన బండి సుధాకర్ తో పాటు పి ఏ సి ఎస్ చైర్మన్, జిల్లా మార్కెటింగ్ అధికారి, వ్యవసాయ సహాయ సంచాలకులు, ఎల్కతుర్తి గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారి లు డైరెక్టర్ లుగా ప్రమాణ స్వీకారం చేశారు.

ఈ సందర్భంగా ఏఎంసీ చైర్మన్ సంతాజి మాట్లాడుతూ రైతు ప్రయోజనాలే ధ్యేయంగా పనిచేయడంతో పాటు 24 గంటలు రైతులకు అందుబాటులో ఉండి సేవలు అందిస్తానని అన్నారు. ఈ సందర్భంగా నూతన పాలకవర్గానికి పలు పార్టీల నాయకులు, అధికారులు శుభాకాంక్షలు తెలిపారు.

కార్యక్రమంలో కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు ఇంద్రసేనారెడ్డి, టిపిసిసి సభ్యులు బొమ్మనపల్లి అశోక్ రెడ్డి, సింగిల్ విండో మాజీ చైర్మన్ గోలి రాజేశ్వరరావు, మండల యూత్ అధ్యక్షులు అంబాల శ్రీకాంత్ (బక్కి) సింగిల్ విండో డైరెక్టర్ ముప్పు మహేందర్, హింగే శ్రీకాంత్, పాక రమేష్, అంబాల స్వామి, జిలుగుల మాజీ సర్పంచులు గూటం జోగిరెడ్డి, రావుల రమేష్, ముఖ్య నాయకులు , కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

 

 

ఎల్కతుర్తి ఏఎంసీ చైర్మన్ సుకినె సంతాజీకి శుభాకాంక్షల వెల్లువ