- బతుకమ్మ పండుగకు ఇందిరమ్మ కానుకగా చీరలు
- మహిళా కాంగ్రెస్ కోరుట్ల నియోజకవర్గ అధ్యక్షురాలు భవితారాణి
వేద న్యూస్, ప్రతినిధి మెట్ పల్లి :
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆడపడుచులు చిన్నలు పెద్దలు కలిసి ఘనంగా జరుపుకునే బతుకమ్మ పండుగ సందర్భంగా ప్రతి మహిళ లబ్ధిదారికి రెండు ఇందిరమ్మ చీరలు ఉచితంగా ఇవ్వనున్నట్లు మహిళా కాంగ్రెస్ కోరుట్ల నియోజకవర్గ అధ్యక్షురాలు అందే భవితరాణి తెలిపారు.
ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం సిరిసిల్ల చేనేత కార్మికుల చేత 65 లక్షల చీరల తయారీకి ఆర్డరు ఇచ్చింది అన్నారు. మొత్తం 318 కోట్ల ఖర్చుతో దాదాపు 9 కోట్ల మీటర్ల బట్ట తయారీకి అనుమతి ఇచ్చింది అన్నారు. ఇప్పటికే 36 లక్షల చీరలు సిద్ధం అయ్యాయని తెలిపారు.
సెప్టెంబర్ 15వ తేదీ లోపు ఉత్పత్తి పూర్తి చేయనున్నారని భవితారాణి మంగళవారం వివరించారు. ప్రతి చీర విలువ సుమారు 800 రూపాయలు ఉంటుందని ఆమె తెలిపారు.
ఈ చీరల పంపిణీ కార్యక్రమంతో తెలంగాణ ఆడపడుచులపై రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎంత గౌరవం ఉందో దీనితో రుజువైందని ఆమె అన్నారు.ఈ కార్యక్రమం వల్ల బతుకమ్మ చీరల పంపిణీ తో పాటు సిరిసిల్ల చేనేత కార్మికులకు ఏడాది పొడవునా ఉపాధి లభిస్తుందని భవితరాణి అన్నారు.