•   గ్రామాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తా..

వేద న్యూస్, జమ్మికుంట:
గ్రామ ప్రజలు ఆశీర్వదించి.. గ్రామ సర్పంచ్‌గా తనకు అవకాశమిస్తే.. గ్రామాన్ని
అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తానని పాపయ్యపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థి గుండెకారి సరోజన పేర్కొన్నారు.

శుక్రవారం ఆమె సర్పంచ్‌గా నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గ్రామ శ్రేయస్సే ధ్యేయంగా ముందుకెళ్తామని చెప్పారు. ప్రజాసేవ కోసమే తాను బరిలో నిలిచానని, అందరి శ్రేయస్సు, సంక్షేమమే లక్ష్యంగా పని చేస్తానని వెల్లడించారు.