- గ్రామ సమస్య ల ను పరిష్కరిస్తా:.లునవత్ ప్రభు
- ప్రచారం లో దూసుకెళ్తున్న స్వతంత్ర అభ్యర్థి
వేద న్యూస్, టేక్మాల్:
మెదక్ జిల్లా టేక్మాల్ మండల పరిధిలోని షాబాద్ తండాలొ సర్పంచ్ అభ్యర్థి లునవత్ ప్రభు నాయక్ ప్రచారం లో దూసుకుపోతున్నారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ..తండా ప్రజలందరూ తనను ఆశీర్వదించి గెలిపించాలని స్వతంత్ర అభ్యర్థి లునవత్ ప్రభు కోరారు.
ఆదివారం ప్రతి తండా తండాలో గడప గడపకు తిరుగుతూ తనకు ప్రభుత్వం కేటాయించిన బ్యాట్ గుర్తును చూపిస్తూ ప్రజల ఓటును అభ్యర్థించారు.అలాగే తండాలో డ్రైనేజీలు, వీధి లైట్లు, విద్య,వైద్యం పై ప్రత్యేక దృష్టి పెడతానని పేర్కొన్నారు.
గ్రామంలో నెలకొన్న సమస్యలపై దృష్టి సారిస్తానన్నారు. బడుగు, బలహీన వర్గాల ప్రజలను ఆదుకుంటానని హామీఇచ్చారు.. ఏ ఒక్కరికి సంక్షేమ పథకాలు అందకపోయినా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి వెంటనే పరిష్కరిస్తానని తెలిపారు.
తనను ప్రజలు ఆశీర్వదించి భారీ మెజారిటీతో గెలిపించాలని ఈ సందర్భంగా ఆయన కోరారు.
వారితో కార్యకర్తలు, మాజీ ఉప సర్పంచ్ సురేష్,రమేష్, నరేష్, శంకర్, శిత్యా, తులాషిరం, నాను, గోపాల్, బి, రమేష్ తదితరులు పాల్గొన్నారు.