వేద న్యూస్, టేక్మాల్ :

మెదక్ జిల్లా టేక్మాల్ మండల్ పరిధిలోని ప్రత్యేక షాబాద్ లంబాడి గ్రామ పంచాయతీ కాంగ్రెస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి ఎం.రాజు నాయక్  ప్రజల వద్దకు వెళ్తున్నారు. తనను ఆశీర్వదించి .. సర్పంచ్ గా అవకాశమిస్తే గ్రామాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తానని చెప్పారు. 

గురువారం ఉదయం గ్రామపంచాయతీ కార్యాలయంలో నామినేషన్ స్వీకరణ కేంద్రంలో 
నామినేషన్ దాఖలు చేశారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ.. గ్రామంలో డ్రైనేజీలు, వీధి లైట్లు, విద్య వైద్యం పై ప్రత్యేక దృష్టి పెడతానని పేర్కొన్నారు. గ్రామంలో నెలకొన్న సమస్యలపై దృష్టి సారిస్తానన్నారు. బడుగు, బలహీన వర్గాల ప్రజలను ఆదుకుంటానని చెప్పారు.

ఏ ఒక్కరికి సంక్షేమ పథకాలు అందకపోయినా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి వెంటనే పరిష్కరిస్తానని తెలిపారు. తనను ఆశీర్వదించి భారీ మెజారిటీతో గెలిపించాలని ఈ సందర్భంగా ఆయన ప్రజలను  కోరారు . నామినేషన్ కార్యక్రమంలో  కార్యకర్తలు సురేష్, సేవాలాల్, నిల్యా, విట్టల్, చందర్, సుభాష్, రాజు, బాబు, వస్రం మొత్య తదితరులు పాల్గొన్నారు.