– 13 గ్రామాల్లో అభ్యర్థులకు జోష్!

వేద న్యూస్,కాసిపేట:

కాసిపేట మండలంలోని 22 గ్రామపంచాయతీల్లో స్థానిక సంస్థల సర్పంచ్ ఎన్నికలు ఉత్కంఠతరం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో మంచిర్యాల ఎమ్మెల్యే కోకిరాల ప్రేమ్ సాగర్ రావు దేవాపూర్ ఆదాని కంపెనీ కార్మిక సంఘం అధ్యక్షుడు కోకిరాల సత్యపాలరావు మద్దతు ప్రకటించిన అభ్యర్థులకు బలమైన ప్రజా గాలి వీచుతోంది. బుధవారం ధర్మరావుపేటలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి తము బలపరుస్తున్న అభ్యర్థుల వివరాలు ప్రకటించారు ఈ సందర్భంగా దేవాపూర్ అదానీ కంపెనీ కార్మిక సంఘం అధ్యక్షులు కోకిరాల సత్యపాల్ రావు మాట్లాడుతూ
“తమ తండ్రి స్వర్గీయ కోకిరాల రఘుపతిరావు ప్రజాసేవా పరంపర, వారి మంచి పనులపై ప్రజలకు ఉన్న నమ్మకం వల్లే అభ్యర్థులు కోకిరాల కుటుంబం వైపు చేరుతున్నారు అని అన్నారు. ఈ ఎన్నికల్లో మా అభ్యర్థులు ఘన విజయం సాధించటం ఖాయం’’ అని తెలిపారు.22 గ్రామాలలో పోటీలు జరుగుతున్నప్పటికీ, ధర్మారావుపేట్ గ్రామంలో సర్పంచ్ పదవి ఏకగ్రీవంగా ఖరారై ముందుగానే గెలుపు పతాక ఎగరవేసింది. మిగతా గ్రామాల్లో కూడా కోకిరాల కుటుంబం మద్దతు ఉన్న అభ్యర్థులు బలమైన ఆధిక్యంలో ఉన్నారని స్థానికులు వెల్లడిస్తున్నారు.
ఈ సందర్భంగా తమ అభ్యర్థుల జాబితా వెల్లడించారు. గట్రావ్ పల్లి మేస్రం వెంకటలక్ష్మి, మల్కపల్లి కోట్నాక రాఘు,
ధర్మారావుపేట్ జుగునాకా రాధా (ఏకగ్రీవం),
కొండాపూర్ ఒల్లాపు రాజు,
దేవాపూర్ రాయి సిడం రాందాస్, మద్దిమడ భీమిని మాదవి లత,
మామిడిగూడ (తండా) బుల్క్యా సుజాన్య, లంబాడితండా (కే) బోడ బలరాం పెద్దనపల్లి వేముల కృష్ణ,
రొట్టేపల్లి ఆత్రం కలావతి వెంకటాపూర్ అడే శంకర్,
సోనాపూర్ మహేందర్, కోమటి చేను జాడి మాణిక్యం ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు సిద్ధం తిరుపతి, మాజీ ఎంపీటీసీ పర్వతి మల్లేష్, శేఖర్ రావు, కనక రాజు, ఎంబడి కిషన్, కూకట్ల దేవేందర్, చారి, అనంత రావు ఆత్రం చిన్ను కోకిరాల రఘుపతిరావు అభిమానులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.