– ఫ్యాన్‌కు ఉరివేసుకుని (28)ఏళ్ల మహిళ బలి
వేద న్యూస్,ఇల్లంతకుంట:
రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం అనంతారం గ్రామంలో విషాదం నెలకొంది.గత కొంతకాలంగా మానసిక సమస్యలతో చికిత్స పొందుతున్న ఒక వివాహిత మహిళ తన ఇంట్లోనే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.గ్రామానికి చెందిన కుమ్మరవేణి లత (28), భర్త నాగరాజు. లత కొంతకాలంగా మానసిక రుగ్మతతో బాధపడుతున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.ఇంట్లో ఎవరూ లేని సమయంలో లత తాడుతో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.ఈ సంఘటనపై మృతురాలి తల్లి, పసుపుల లక్ష్మి, పోలీసులకు ఫిర్యాదు చేశారు.వారి ఫిర్యాదు మేరకు ఎస్సై సిరిసిల్ల అశోక్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.మృతురాలు లతకు ఐదు (5) సంవత్సరాల వయస్సు గల ఒక కుమారుడు ఉన్నాడని ధృవీకరించారు.