వేద న్యూస్ ,ఇల్లంతకుంట:

ఇల్లంతకుంట మండలం కందికట్కూర్ (ఎస్సీ కాలనీ)రైలు-బడి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో మన రాష్ట్ర పండుగ అయినా బోనాల పండుగను నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో విద్యార్థులు తల్లిదండ్రులు ఉత్సాహంగా పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగాపాఠశాలప్రధానోపాధ్యాయులు బద్దం రవీందర్ రెడ్డి మాట్లాడుతూ ఈ పండుగను ఆషాడ మాసంలో ప్రారంభించి శ్రావణమాసం చివరిదాకా జరుపుకుంటారు. వర్షాలు బాగా కురవాలని పాడిపంటలు బాగా అభివృద్ధి చెందాలని ప్రజలంతా ఎట్లాంటి అనారోగ్యాల బారిన పడకుండా ఉండాలని అమ్మవారిని గ్రామదేవతలను కోరుకుంటూ జరుపుకునే పండుగ ఇది. అని వివరించడం జరిగింది ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు అనువోజు రాజు. అంగన్వాడీ టీచర్ లక్ష్మి మరియు తల్లిదండ్రులు విద్యార్థులు పాల్గొన్నారు