విద్యార్థులు పోతారాజు వేషాలతో విన్యాసాలు
వేద న్యూస్,బోయినిపల్లి:
రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండల కేంద్రంలోని ఆనంద్ విద్యానికేతన్ హై స్కూల్ లో ఘనంగా బోనాల పండుగ నిర్వహించారు ఈ రోజు స్కూల్ టీచర్లు విద్యార్థులు బోనాలు తీసుకొని పోచమ్మ దేవాలయం కు వెళ్లి మొక్కలు చెల్లిచుకున్నారు పిల్లలు పోతారాజు ల వేశాధారణ చేసుకొని నృత్యాలు చేస్తూ విద్యార్థులు డాన్స్ లు చేస్తూ గ్రామ ప్రజల ను ఆకట్టుకోవడం జరిగింది ఈ సందర్బంగా ఆనంద్ విద్యానికేతన్ పాఠశాల ప్రిన్సిపాల్ మాట్లాడుతూ తెలంగాణలో బోనాల పండగ ఒక విశిష్టతను విద్యార్థులకు వివరించడం జరిగింది. అలాగే ఈ పండుగను ఆషాడ మాసంలో ప్రారంభించి శ్రావణమాసం చివరిదాకా జరుపుకోవడం జరుగుతుంది వర్షాలు బాగా కురవాలని పాడి పంటలు బాగా అభివృద్ధి చెందాలని ప్రజలంతా ఎలాంటి అనారోగ్యాల బారిన పడకుండా ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని పోచమ్మ తల్లికి బోనాలు సమర్పించారు ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన పోతరాజు విన్యాసాలు గ్రామ ప్రజలను అలరించాయి. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు, మరియు విద్యార్థిని విద్యార్థులు, పాల్గొన్నారు.