– కేయూ విద్యా సంఘాల ఐక్యకాచరణ కమిటీ

వేద న్యూస్, హన్మకొండ :

కాకతీయ యూనివర్సిటీలో విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఇంటిగ్రేటెడ్ పాఠశాలను స్వాగతిస్తున్నామని కాకతీయ యూనివర్సిటీ వీ.సి వైస్ చాన్సర్ కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ పేద విద్యార్థుల భవిష్యత్తు కోసం అంతర్జాతీయ ప్రమాణాలతో తీసుకొస్తున్న ఇంటిగ్రేటెడ్ పాఠశాలను అడ్డుకుంటే ఊరుకునేది లేదన్నారు. బీఆర్ఎస్వీ విద్యార్థి సంఘం పేద విద్యార్థుల భవిష్యత్తు ను పక్కనపెట్టి ఇంటిగ్రేటెడ్ స్కూల్ పై రాజకీయం చేసి అడ్డుకోవాలని చూస్తే ఊరుకునేది లేదన్నారు. యూనివర్సిటీలను నిర్వీర్యం చేసి యూనివర్సిటీ భూములను కబ్జాలు జరిగింది బిఆర్ఎస్ ప్రభుత్వం సమయంలోనే జరిగిందన్నారు. ప్రైవేట్ యూనివర్సిటీలు తీసుకొచ్చి ప్రభుత్వం యూనివర్సిటీలను నిర్వీర్యం చేసిన ఘనత బి ఆర్ఎస్ పార్టీది అన్నారు. ఇన్ని ఘనకార్యాలు చేసిన పార్టీ అనుబంధ విద్యార్థి సంఘానికి యూనివర్సిటీల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు. ఇప్పటికైనా వారి పద్ధతిని మార్చుకొని పేద విద్యార్థుల భవిష్యత్ కోసం అంతర్జాతీయ ప్రమాణాలతో తీసుకొస్తున్న ఇంటిగ్రేటెడ్ స్కూలు స్వాగతించాల్సిందిగా వారు కోరారు. తక్షణమే ఇంటిగ్రేటెడ్ పాఠశాలకు యూనివర్సిటీ అధికారులు స్థలం కేటాయించి పనులు ప్రారంభించాలని విద్యార్థి సంఘాల ఐక్యకారి చరణ కమిటీ తరఫున డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి సంఘాల నాయకులు సారయ్య, వంశీ కృష్ణ, మేడ రంజిత్ కుమార్, రాజునాయక్, కన్నం సునీల్, బొట్ల మనోహర్, కడపాక రాజేందర్, సాయి, కృష్ణ, బీసీ సంఘం కేతపాక ప్రసాద్, ప్రదీప్, రవి,అలువల కార్తీక్, రాకేష్, కృష్ణ, లోక్ నాయక్, సౌరం రాహుల్ వర్ధన్, నాగరాజు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు డాక్టర్ తీగల ప్రేమ్ కుమార్, మరియు కాకతీయ యూనివర్సిటీ పరిశోధక విద్యార్థులు పీజీ విద్యార్థులు పాల్గొన్నారు.