– ఇంచార్జి కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి గరిమ అగ్రవాల్

వేద న్యూస్,రాజన్న సిరిసిల్ల:

కోనరావుపేట, చందుర్తి,వేములవాడ రూరల్ డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల్లో తనిఖీ
రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ ఈ సీ) నిబంధనలకు అనుగుణంగా విధులు నిర్వర్తించాలని ఇంచార్జి కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి గరిమ అగ్రవాల్ ఆదేశించారు. గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో మొదటి ఫేజ్ ఎన్నికలు నిర్వహించనున్న సందర్భంగా కోనరావుపేట, చందుర్తి, వేములవాడ రూరల్ మండలాల్లో ఏర్పాటు చేసిన ఎన్నికల సామగ్రి డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలను ఇంచార్జి కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి గరిమ అగ్రవాల్ బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఇంచార్జి కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి గరిమ అగ్రవాల్ మాట్లాడారు. ఎస్ఈసీ ఆదేశాల ప్రకారం విధులు నిర్వర్తించాలని సూచించారు. బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పేపర్లు, ఇంక ఇతర సామగ్రి సరిచూసుకోవాలని సూచించారు. డిస్ట్రిబ్యూషన్ కేంద్రం నుంచి పోలింగ్ కేంద్రాలకు కేటాయించిన వాహనాల్లోనే ఎన్నికల సామగ్రి తరలించాలని స్పష్టం చేశారు. ఓట్ల లెక్కింపు తదితర అంశాలపై అవగాహన కల్పించారు. పోలింగ్ కేంద్రాలకు తరలివెళ్తున్న అధికారులు, సిబ్బందితో మాట్లాడారు. ఆయా డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల్లో అదనపు కలెక్టర్ గడ్డం నగేష్, ఏఎస్పీ చంద్రయ్య, వేములవాడ ఆర్డీఓ రాధాభాయ్, జడ్పీ డిప్యూటీ సీఈవో గీత, డీవీహెచ్ఓ రవీందర్ రెడ్డి, జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మీరాజం తహసీల్దార్లు, ఎంపీడీఓలు, ఎంపీఓలు తదితరులు పాల్గొన్నారు.