•  హస్తం పార్టీవాదిగా కంకణబద్ధుడై సేవలు
  •  నిత్యం పార్టీ వాదనను బలపరుస్తూ జనంలోకి..
  •  కరుడుగట్టిన కాంగ్రెస్‌వాదిగా పేరుగాంచిన నేత

వేద న్యూస్, కరీంనగర్:

కాంగ్రెస్ పార్టీ విధానాలు, ప్రభుత్వ స్కీములపైన అవగాహన కల్పించడంలో ఆయన అందరికంటే ముందుండే ప్రయత్నం చేస్తుంటారు. విపక్షాల విమర్శలను ఎప్పటికప్పుడు తన శక్తి మేరకు తిప్పికొడుతూ.. ఆయన పలు విషయాలను ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుండటం విశేషం. ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిలా తన వంతుగా ప్రయత్నాలు చేయడంలో ఆయన ఏ మాత్రం వెనకాడరు. ఆయనే.. కాంగ్రెస్‌కు కంకణబద్ధుడైన నాయకుడు కొలిపాక శ్రీనివాస్.

సర్కారు వాదనను బలపరుస్తూ.. క్యాంపెయిన్

రేవంత్‌రెడ్డి నాయకత్వంలోని రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వ పని విధానంపైన నిత్యం కొలిపాక శ్రీనివాస్ సోషల్ మీడియా వేదికగా, బయటా విస్తృతంగా ప్రజలకు ప్రచారం చేసే ప్రయత్నం చేస్తారు. సీఎం రేవంత్‌రెడ్డికి వీరాభిమానిగా, ఆయన నాయకత్వ పటిమను, ప్రజల కోసం పరితపించే విధానం గురించి కాంగ్రెస్ శ్రేణులతో పాటు జనానికి వివరించే ప్రయత్నం చేయడంలో కొలిపాక శ్రీనివాస్ ముందుంటారు.

తెలంగాణ ప్రదాత సోనియాగాంధీ దీవెనలతో రాష్ట్రంలో రేవంత్ పాలన.. ప్రజా పాలనగా సాగుతోందని కొలిపాక శ్రీనివాస్ వివరిస్తున్నారు. పేదలకు సంక్షేమం అందించేది కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని వెల్లడిస్తున్నారు.

ప్రస్తుతం మాదిరిగానే పాలన కొనసాగితే.. రాష్ట్రంలో కాంగ్రెస్ మరో పదేండ్లు అధికారంలో ఉండటం ఖాయమని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కొలిపాక శ్రీనివాస్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రజాపాలనలో రాష్ట్రం దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా పోటీపడేలా తీర్చిదిద్దే ప్రయత్నాలను శక్తివంచన లేకుండా సమర్థవంతంగా రేవంత్ నాయకత్వంలోని సర్కారు చేస్తోందని ఘంటాపథంగా ప్రజలకు శ్రీనివాస్ వివరిస్తున్నారు.

 

బీసీలపై బీఆర్ఎస్ మొసలి కన్నీరు.. కవిత వ్యాఖ్యలను ఖండించిన కొలిపాక శ్రీనివాస్