వేదన్యూస్ – ఢిల్లీ
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పరిధిలోని కంచ గచ్చిబౌలి భూములపై దేశ అత్యున్నత న్యాయ స్థానమైన సుప్రీం కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. కంచ గచ్చిబౌలి భూముల్లో ఇకపై ఎలాంటి చెట్లను నరకకూడదు. తదుపరి ఆదేశాలను జారీ చేసేవరకూ అక్కడ ఏ మొక్క.. ఏ చెట్టును కొట్టేయకూడదు.
ఎలాంటి పనులను చేపట్టకూడదని ఆదేశించింది. ఈ సందర్భంగా సుప్రీంకోర్టులో వటా అసోసియేషన్, హెచ్ సీయూ విద్యార్థులు వేసిన పిటిషన్ పై విచారించిన సుప్రీం కోర్టు ఈరోజు ఉదయం తెలంగాణ హైకోర్టు రిజిస్ట్రార్ ను కంచ గచ్చిబౌలి భూముల దగ్గరకు వెళ్లాలి. మూడున్నరకు అక్కడ పరిస్థితులపై నివేదిక ఇవ్వాలని ఆదేశించిన సంగతి తెల్సిందే. రిజిస్ట్రార్ అక్కడకెళ్లి ఆరా తీసి నివేదికను సుప్రీం కోర్టుకు సమర్పించారు.
నివేదికను పరిశీలించిన సుప్రీం కోర్టు పై విధంగా ఉత్తర్వులిచ్చింది. అంతేకాకుండా ఇది చాలా సున్నితమైన విషయం. ఇలాంటి విషయాల్లో ఇలాగానే స్పందించేది అని సీఎస్ పై తీవ్ర అగ్రహాం ను వ్యక్తం చేసింది. తదుపరి ఆదేశాలను జారీ చేసేవరకూ ఎలాంటి పనులైన చెపడితే తర్వాత చర్యలు చాలా కఠినంగా ఉంటాయని హెచ్చారించింది.