వేద న్యూస్, వరంగల్:
హన్మకొండ లో మున్సిపల్ నిబంధనలకు విరుద్దంగా భవన నిర్మాణం చేపట్టిన బంధన్ హాస్పిటల్ నిర్వహిస్తున్న యాజమాన్యానికి గ్రేటర్ వరంగల్ మున్సిపల్ అధికారులు బుధవారం షోకాజ్ నోటీసు జారీ చేశారు.

భవన నిర్మాణానికి ముందు ప్లాన్ లో స్టిల్ట్ కు అనుమతి తీసుకొని అందులో పార్కింగ్ కు బదులుగా నిర్మాణం చేసినట్లు పేర్కొన్నారు.అంతేకాకుండా పెంట్ హౌస్ కు ఎలాంటి అనుమతి లేకుండా నిర్మించారని తెలిపారు.

మొత్తం బిల్డింగ్ నిర్మాణంలో కూడా డివియేషన్ ఉందని పేర్కొన్నారు. ఈ షోకాజ్ నోటీస్ పై 7 రోజుల్లోగా వివరణ ఇవ్వాలని లేని యెడల చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆ నోటీసులో గ్రేటర్ అధికారులు పేర్కొన్నారు.