వేద న్యూస్, వరంగల్ క్రైమ్ :

మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో విధులు నిర్వర్తిస్తున్న ఓ ఎస్సైను పోలీస్ బాస్ సస్పెండ్ చేసినట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది.

గత నెలలో మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ హోటల్ నిర్వాహకురాలి పై మద్యం మత్తులో చేయి చేసుకున్నాడని ఓ దళిత మహిళ.. ఎస్సై పై ఫిర్యాదు చేసింది.దీంతో ఉన్నతాధికారులు ఎస్సైపై వచ్చిన ఆరోపణల ఆధారంగా విచారణ జరిపి సస్పెండ్ చేసినట్లు తెలుస్తోంది.

 

ఇదిలా ఉంటే బాధిత మహిళను ఫిర్యాదు విత్ డ్రా చేసుకోవాలని మధ్యవర్తితో రూ.లక్షలు ఖర్చు చేయడానికి ప్రయత్నించారని ఆరోపణలు సైతం బలంగా వినిపిస్తున్నాయి.