వేద న్యూస్, జమ్మికుంట:

జమ్మికుంట కేశవపురంలోని శ్రీ విద్యారణ్య ఆవాస విద్యాలయంలో నూతన ప్రవేశాల కోసం ఆదివారం ప్రవేశ పరీక్ష నిర్వహించారు. ఇందులో ఒకే రోజు 514 మంది విద్యార్థులు ప్రవేశ పరీక్షకు హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతనంగా హాజరైన విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశం ఏర్పాటు చేసి వారి వారి అభిప్రాయాలను  తెలపాలని సూచించారు. 

పేరెంట్స్  మాట్లాడుతూ ఇలాంటి ఆహ్లాదకరమైన వాతావరణంలో మన సంస్కృతి సాంప్రదాయాలను, ఆధ్యాత్మికతను, దేశభక్తిని, దైవభక్తిని, నైతిక విలువలను జోడించి బోధిస్తున్న ఈ పాఠశాలలో తమ పిల్లలకు అవకాశం రావాలని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానాచార్యులు పోల్సాని సుధాకర్ రావు,  పాఠశాల సమితి అధ్యక్షుడు చిట్టి రెడ్డి శ్రీనివాస్ రెడ్డి, పాఠశాల అధ్యక్షుడు ముక్క జితేందర్ గుప్తా, పాఠశాల కార్యదర్శి చిదురాల భాస్కర్, పాఠశాల ఆచార్యులు, మాతాజీలు పాల్గొన్నారు.