• బీసీ సంఘం నాయకుడు డ్యాగల శ్రీనివాస్ ముదిరాజ్

వేద న్యూస్ , వరంగల్:

బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ ఆదేశాల మేరకు వరంగల్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్,  నర్సంపేట నియోజకవర్గం ఇన్ చార్జి డ్యాగల శ్రీనివాస్ ముదిరాజ్ ఆధ్వర్యంలో బీసీ కుల సంఘాల నాయకులతో కలిసి నర్సంపేట రెవెన్యూ డివిజన్ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్రంలో కుల గణన చేపట్టి ప్రభుత్వం స్థానిక సంస్థల రిజర్వేషన్లు 42% శాతం బీసీలకు పెంచాలని వినతి పత్రాన్ని ఏవో శ్రీనివాస్ కు సమర్పించారు.

ఈ సందర్భంగా డ్యాగల శ్రీనివాస్ ముదిరాజ్ మాట్లాడుతూ రాష్ట్రంలో బీసీ లు అత్యధిక జనాభా ఉన్నా రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా, వెనుకబడిన బీసీ లను గుర్తించాలని పేర్కొన్నారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం బీసీల లెక్కలు తేల్చాలని ‘‘మేము ఎంతో ఉన్నామో మా లెక్కలు లెక్కించాలని’’ రెవెన్యూ డివిజన్ కార్యాలయం ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

జనాభా దామాషా ప్రకారం కుల గణన చేపట్టి 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ 2023 ఎమ్మెల్యే ఎన్నికల ప్రచారంలో భాగంగా కామారెడ్డి సభ వేదికగా కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ తమ ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచిన సంగతి గుర్తుచేశారు.

జనవరిలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ ఢిల్లీలో రాహుల్ గాంధీని కలిశారని.. అదే సమయంలో రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని కలిసిన తర్వాత ఫిబ్రవరిలో జరిగిన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో అసెంబ్లీ బిల్లు పెట్టి ఏకగ్రీవ తీర్మానం చేసి జీవో నం. 26ను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తూ రూ.150 కోట్ల బడ్జెట్ ను కూడా కేటాయించిందని  ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారని స్పష్టం చేశారు.

కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ ప్రకారమే బీసీలకు స్థానిక సంస్థలలో 42% శాతం రిజర్వేషన్లు పెంచిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని డ్యాగల శ్రీనివాస్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేని పక్షంలో జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనన్న ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని డ్యాగల శ్రీనివాస్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి కురిమిళ్ల రమేష్ చారి, బండారి సుమంత్, గోపగాని శోభన్ బాబు దూపటి సుమన్ బీసీ నాయకులు ఆబోతు రాజు యాదవ్, మచ్చిక రాజు గౌడ్, పట్టణ ఉపాధ్యక్షులు మద్దెల శ్యామ్ కుమార్ యాదవ్, కార్యదర్శి ఓడపెల్లి రమేష్, కొమ్మ శ్రీకాంత్, గాండ్ల శ్రీనివాస్, మర్రి క్రాంతి కుమార్, కొలిపాక సుధాకర్, మడూరి సుభాష్ గౌడ్, బేతి భాస్కర్, శీరంశెట్టి రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.