వేద న్యూస్ , జమ్మికుంట:
మోత్కూలగూడెం కు చెందిన పొనగంటి సంపత్ పటేల్ రెండవ సారి రాష్ట్ర స్థాయి అవార్డు అందుకున్నారు.పెద్దపల్లి జిల్లా డి ఎం హెచ్ ఓ కార్యాలయంలో టి . బి ల్యాబ్ సూపర్ వైజరగా విధులు నిర్వహిస్తున్న కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గo జమ్మికుంట మున్సిపల్ పరిధి మోత్కులగూడెం కు చెందిన పొనగంటి సంపత్ పటెల్ వారు అందించిన సేవలకు గాను ప్రపంచం క్షయ నివారణ దినోత్సవం సందర్భంగా మార్చి 24న హైదరాబాద్ గాంధీ ఆసుపత్రి ఆవరణములో ఏర్పాటు చేసిన కార్యక్రమములో రాష్ట్రస్థాయి అవార్డు అందజేశారు.
తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ ఫెయిర్ అధికారి రవీందర్ నాయక్, తెలంగాణ రాష్ట్ర ఎపిడెమియాలజిస్ట్ డాక్టర్ సుమలత ఆధ్వర్యములో తెలంగాణ రాష్ట్ర టి. బి జాయింట్ డైరెక్టర్ డాక్టర్ రాజేశం చేతుల మీదుగా టి. బి ల్యాబ్ సూపర్ వైజరగా పొనగంటి సంపత్ రెండవసారి రాష్ట్ర స్థాయి ఉత్తమ అవార్డును అందుకున్నారు.
సంపత్ పటేల్ చేస్తున్న సేవకు ఇది నిదర్శనమని, ప్రతి కేసును ఇంటిపేరుతో సహా గుర్తుంచుకొని ప్రత్యేక శ్రద్దతో కృషి చేస్తారని పెద్దపల్లి జిల్లా ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ కె. ప్రమోద్ కుమార్ , డా.సుధాకర్ రెడ్డి(ఎన్టీఈపీ) కొనియాడారు.జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యములో వారిని ఘనంగా సన్మానించారు.
తమ గ్రామ నివాసి ఇలా రెండవ సారి రాష్ట్రస్తాయి అవార్డు పొందడం చాలా సంతోషదాయకమని, సంపత్ సేవలు ప్రశంస నియమని మోత్కూలగూడెం చెందిన డాక్టర్ ఊడ్గుల సురేష్, డాక్టర్ కామిశెట్టి కిషోర్, పలువురు గ్రామ పెద్దలు,తోటి మిత్రులు,కుటుంబ సభ్యులు సంపత్ పటేల్ కు అభినందనలు తెలిపారు. సంపత్ పటేల్ రెండవసారి రాష్ట్రస్తాయి అవార్డు అందుకోవడం మాలాంటి ఉద్యోగులకు స్ఫూర్తి దాయకమని ‘సన్మిత్ర ‘ ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘం సభ్యులు హర్షం వ్యక్తం చేస్తూ సంపత్ పటేల్ కు అభినందనలు తెలిపారు.