వేద న్యూస్, గంభీరావుపేట :

గంభీరావుపేట మండలం నర్మల గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..నర్మల గ్రామానికి చెందిన లోకం శ్రీకాంత్ (25) ఉద్యోగం వెతుకుతూ పోటీ పరీక్షలు రాశాడు. ఉద్యోగం రాకపోవడంతో మనస్తాపం చెంది హైదరాబాదు నుంచి బుధవారం రాత్రి తన సొంత గ్రామమైన నర్మలకు వచ్చి గ్రామ శివారులో ఉన్న పొలం వద్ద మామిడి చెట్టుకు ఎవరూలేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నడు. కుటుంబ సభ్యుల పిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై రమాకాంత్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.