వేద న్యూస్, వరంగల్:
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మంత్రి కొండా సురేఖ క్షమాపణలు చెప్పారు. మీడియా సమావేశంలో ఆమె గురువారం మాట్లాడుతూ..తన కూతురు పోలీసులు వచ్చారని ఏదో ఆవేశంలో మాట్లాడిందని, దానికి తాను రేవంత్ రెడ్డికి క్షమాపణలు చెబుతున్నట్టు పేర్కొన్నారు. తమదంతా ఒకటే కుటుంబం, కుటుంబంలో గొడవలు రావడం సహజం అని వెల్లడించారు.
మంత్రి కొండా సురేఖ సీఎంకు క్షమాపణలు చెప్పడంతో వివాదం సద్దుమణిగింది. ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్ చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తో పాటు ఇతర మంత్రులతో కలిసి సురేఖ మీడియా సమావేశంలో పాల్గొన్నారు.