D. Sridhar Babu Minister of IT of TelanganaD. Sridhar Babu Minister of IT of Telangana

వేదన్యూస్ – డా.బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర నూతన సచివాలయం

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన భూమిలో ఒక్క అంగుళం కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకోదు అని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్ధిళ్ల శ్రీధర్ బాబు అన్నారు.డా. బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర నూతన సచివాలయంలో జరిగిన మీడియా సమావేశంలో మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ వారం రోజుల క్రితం యూనివర్సిటీ వీసీ, రిజిస్టార్ తో చర్చలు జరిపాము.ఈ చర్చల్లో వారికి స్పష్టంగా చెప్పాము.

కొన్నాళ్లుగా పెండింగ్ లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని అనుకున్నాము.వర్సిటీకి చెందిన భూములు వాళ్లకే చెందుతాయి. 2016లో సీనియర్ ఐఏఎస్ అధికారులతో ఒక కమిటీని ఏర్పాటు చేశాము. ఆ కమిటీ 1500లకు పైగా ఎకరాల భూమిని వర్సిటీకి ఇవ్వడానికి సిపార్సులు చేసింది.దీన్ని దృష్టిలో పెట్టుకోని మీ కౌన్సిల్ లో చర్చించాలని సూచించాము.

ఈ భూములకు చట్టఫరమైన హక్కులన్నీ ఇవ్వడానికి ప్రయత్నాలు చేస్తామని కూడా చెప్పామని మీడియాకు తెలిపారు. ఆయన ఇంకా మాట్లాడుతూ కొన్ని రాజకీయ పార్టీలు తమ స్వార్ధం కోసం విద్యార్థుల జీవితాలతో ఆటలు ఆడుతున్నారు. భూములపై అసత్య ప్రచారం చేస్తున్నారు. ప్రభుత్వ పనికి అడ్డుపడితే ఊరికునేది లేదని హెచ్చారించారు. వర్సిటీకి సంబంధం లేని నాలుగోందల ఎకరాలను మాత్రమే తీసుకుంటున్నాము. విద్యార్థులకు అన్ని రకాలుగా అండగా ఉంటామని పేర్కొన్నారు.