వేదన్యూస్ -భద్రాద్రి కొత్తగూడెం
కొత్తగూడెం భద్రాద్రి జిల్లాలో భద్రాచల శాసన సభ్యులు డా. తెల్లం వెంకట్రావు గుండెపోటు వచ్చిన ఓ వ్యక్తికి సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరలవుతుంది. శుక్రవారం ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన మంత్రులు పర్యటించారు.
ఈ పర్యటనలో భాగంగా అక్కడి కార్యక్రమాల్లో పాల్గోనడానికి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ నేత ఉన్నట్లుగా హార్ట్ అటాక్ వచ్చి కిందపడిపోయాడు.
అక్కడే ఉన్న ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు సదరు వ్యక్తికి సీపీఆర్ చేశారు. దీంతో కాసేపు తర్వాత ఆయన స్పృహాలోకి వచ్చారు. అనంతరం ఆయన్ని ఆసుపత్రికి తరలించారు.