వేద న్యూస్, హనుమకొండ బ్యూరో:

 

వ రంగల్ పశ్చిమ శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి ని ఉద్దేశించి మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ గన్మెన్లు లేకుండా హనుమకొండ బస్ స్టాండ్ కి వెళ్ళమని అక్కడి చిరువ్యాపరస్థులు నీకు బుద్ది చెబుతారు అని విసిరిన సవాలును స్వీకరించిన నాయిని వెంటనే స్పందించి హనుమకొండ బస్ స్టాండ్ కి గున్మెన్లు లేకుండా వెళ్లారు.

కాగా దాస్యం వినయ్ భాస్కర్ సవాలుకు తోట పవన్ ప్రతి సవాలు విసిరారు. దాస్యం వినయ్ భాస్కర్ కు దమ్ముంటే బీఆర్ఎస్ హయాంలో కట్టిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లలోకి వెళ్లమని వెళ్తే అక్కడి ప్రజలే దేహశుద్ధి చేస్తారని ఘాటుగా మండిపడ్డారు.

చిరువ్యాపరస్థులను రెచ్చగొట్టి దాస్యం వినయ్ భాస్కర్ పబ్బం గడుపుకునే ప్రయత్నం చేస్తున్నారని తోట పవన్ ఆరోపించారు.

చిరువ్యాపరస్థులకు, ప్రజలకు, మేధావులకు దాస్యం రౌడీయిజం, భూ కబ్జాలు గురించి పూర్తిగా అవగాహన ఉన్నది కాబట్టే ఓటుతో బుద్ధి చెప్పారు అని అన్నారు.