వేద న్యూస్, సూర్యాపేట ప్రత్యేక ప్రతినిధి :
శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ఫేస్- 2 కు రామ్ రెడ్డి దామోదర్ రెడ్డి ఎస్ ఆర్ ఎస్ పి ప్రాజెక్ట్ గా నామకరణం చేస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి తెలిపారు ఆదివారం అయన సూర్యాపేట జిల్లా ,తుంగతుర్తి నియోజకవర్గ కేంద్రంలో దివంగత మాజీ మంత్రి రామ్ రెడ్డి దామోదర్ రెడ్డి సంతాప సభకు హాజరై దివంగత నేతకు ఘనంగా నివాళులర్పించారు.
రామ్ రెడ్డి దామోదర్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు.అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ దివంగత రామిరెడ్డి దామోదర్ రెడ్డి శాసనసభ్యులుగా, మంత్రిగా రాష్ట్రానికి చేసిన సేవలు, త్యాగాలు మర్చిపోలేనివని అన్నారు. ఎస్సారెస్పీ జలాలను ఉమ్మడి నల్గొండ జిల్లాకు తీసుకువచ్చి ఫ్లోరైడ్ భూతాన్ని తరమడంలో దామోదర్ రెడ్డి చేసిన కృషిని దృష్టిలో ఉంచుకొని ఎస్సారెస్పీ పేస్ -2 ప్రాజెక్టుకు రాం రెడ్డి దామోదర్ రెడ్డి (ఆర్ డి ఆర్ ఎస్ ఆర్ ఎస్ పి ) 2 గా నామకరణం చేస్తామని ఇదే ఆయనకు ఇచ్చే ఘనమైన నివాళి అని అన్నారు.
ఇందుకు సంబంధించి 24 గంటల్లో జీవోను ఇస్తామని చెప్పారు .అంతేకాక ఎస్ ఆర్ ఎస్ పి లో పూడికతీత ,కాలువల లైనింగ్ పనులను చేపడతామన్నారు .రామ్ రెడ్డి దామోదర్ రెడ్డి కుటుంబానికి అండగా ఉంటామని ముఖ్యమంత్రి తెలిపారు.
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ,రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి ,రాష్ట్ర రోడ్లు, భవనాలు సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ,రాష్ట్ర రెవెన్యూ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రి జానారెడ్డి ,పలువురు శాసనసభ్యులు, ఎమ్మెల్సీలు, తదితరులు మాట్లాడారు. మాజీ మంత్రి జానారెడ్డి, ఎం ఎల్ సి శంకర్ నాయక్, తుంగతుర్తి ఎం ఎల్ ఏ మందుల సామేల్, ఎం ఎల్ సి అద్దంకి దయాకర్, కొత్తగూడెం ఎం ఎల్ ఏ కూనమనేని సాంబశివరావు, ఎం ఎల్ సి నెల్లికంటి సత్యం,
సత్తుపల్లి ఎం ఎల్ ఏ రాగమయి, తదితరులు మాట్లాడారు.
డిప్యూటీ స్పీకర్ రామచందర్ నాయక్,కోదాడ ఎమ్మెల్యే నలమాద ఉత్తమ్ పద్మావతి రెడ్డి,టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి,చెవిటి వెంకన్న యాదవ్, మార్కెట్ కమిటీ చైర్మన్ వేణారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.