- ఉపాధ్యాయులకు ఇస్తున్న వివిధ రకాల శిక్షణలను వెంటనే నిలిపి వేయాలి
- టిపిటిఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నన్నెబోయిన తిరుపతి డిమాండ్
వేద న్యూస్, హన్మకొండ:
తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ భీమదేవరపల్లి మండల శాఖ ఆధ్వర్యంలో మండలంలోని కొత్తపల్లి ,ముల్కనూర్,ముత్తారం కొత్తకొండ, గట్లనరసింగపూర్, మల్లారం, ముస్తఫా పూర్ తదితర పాఠశాలల్లోని ఉపాధ్యాయులతో బుధవారం సమావేశాలు ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా ముఖ్యఅతిథిగా హాజరైన టిపిటిఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నన్నే బోయిన తిరుపతి సమావేశాల్లో మాట్లాడుతూ.. ప్రభుత్వం పిఆర్సి ని వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేశారు. గత పిఆర్సి కాలం రెండు సంవత్సరాలు గడిచినప్పటికీ ప్రభుత్వం నేటికీ పిఆర్సి పైన నిర్ణయం చేయకపోవడం సరైన ది కాదని చెప్పారు.

పెండింగులో ఉన్న డీఏలను వెంటనే విడుదల చేయాలని, ప్రభుత్వము ఉద్యోగులకు ఇచ్చిన హామీ మేరకు ప్రతినెల రూ. 700 కోట్లను విడుదల చేసి పెండింగ్ బిల్లులను చెల్లించాలని డిమాండ్ చేశారు. విద్యాశాఖ ఎన్జీవోల పేరు మీద ఉపాధ్యాయులకు ఇస్తున్న వివిధ రకాల శిక్షణలను నిలిపివేయాలని,పాఠశాల నుండి టీచర్లను దూరం చేయడం సరైనది కాదని పేర్కొన్నారు.
సమగ్ర శిక్ష ఉద్యోగుల సమ్మె కాలంలో ప్రభుత్వము ఇచ్చిన హామీ మేరకు సమగ్ర శిక్ష ఉద్యోగులకు సమ్మె కాలపు జీతాన్ని వెంటనే చెల్లించాలని, ఉద్యోగులను క్రమబద్ధీకరించి టైం స్కేలు వర్తింపజేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
317 జీవోలో స్థానికత కోల్పోయిన ఉపాధ్యాయులందరికీ తాత్కాలిక బదిలీకి అవకాశం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు.
ఈ సమావేశంలో టిపిటిఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు జిల్లా ఉపాధ్యక్షులు చందుపట్ల రాజేందర్ , చంద్రగిరి లక్ష్మయ్య,మండల శాఖ ప్రధాన బాధ్యులు కాలేసి కొమరయ్య ,ప్రతాప్ అనిల్, వివిధ పాటశాలల ప్రదానోపాద్యాయులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
