వేద న్యూస్, ఇబ్రహీంపట్నం:

ఇబ్రహీంపట్నం మండల ప్రధాన రహదారులపై మక్కకంకులు ఆరబెట్టడంతో వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారు. ఈ సందర్బంగా ఎంపీడీవో మహమ్మద్ సలీం మాట్లాడుతూ మొక్కజొన్న కంకులు రోడ్డుపై ఆరబెట్టుకోవడం వలన ప్రమాదాలు జరుగుతున్నాయని, మండలంలోని సంబంధిత రైతులందరు ప్రధాన రహదారిపై మొక్కజొన్న కంకులను ఆరబెట్టకుండా వారికి అనువైన ప్రాంతాలలో తగిన ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు .

రోడ్డు వెంబడి దాదాపు 70 శాతం రోడ్లను ఆక్రమించి మొక్క జొన్న ఆరబెట్టడం వలన వాహనదారుల రాకపోకలకు చాలా ఇబ్బందులు ఎదురుకుంటున్నారని అన్నారు.

ఒక వాహనం వస్తే మరో వాహనం వెళ్ళడానికి దారి లేక మొక్కజొన్న పై నుండి వెళ్లిన వాహనాలు ఆధుపుతాప్పి ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పారు. 

సంబంధిత రైతులకు చట్ట ప్రకారం ఇబ్బందులు ఏర్పాడే అవకాశం ఉందని, వాహనదారుల ప్రయాణికుల దృష్ట్యా అలోచించి మండలంలోని ఎలాంటి ప్రమాదాలు జరుగకుండా చూడాలని రైతులను సవినయంగా కోరారు.