- ఎల్కతుర్తి మండల తహశీల్దార్‌కు టీఆర్ఆర్ఎస్ వినతి
వేద న్యూస్, వరంగల్:
కాంగ్రెస్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాలని టీఆర్ఆర్ఎస్ (తెలంగాణ రైతు రక్షణ సమితి) నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం టీఆర్ఆర్ఎస్ హన్మకొండ జిల్లా అధ్యక్షుడు హింగె భాస్కర్ ఆధ్వర్యంలో ఆ సమితి మండల అధ్యక్షుడు కె.తిరుపతి, ప్రధాన కార్యదర్శి మాధవరావు, అశోక్ ఎల్కతుర్తి మండల తహశీల్దారుకు వినతి పత్రం సమర్పించారు.
రైతు భరోసా రూ.15 వేలు ఎకరానికి వెంటనే జమ చేయాలని కోరారు. రైతు రుణమాఫీ సంపూర్ణంగా రూ.2 లక్షలు చేయాలని అభ్యర్థించారు. వానాకాలంతో పాటు యాసంగి పంటకు రైతుకు భరోసానివ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.
తమది రైతు సంక్షేమ సర్కారు అని చెప్పుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం మాటల్లో కాకుండా చేతల్లో పనులు చేసి చూపించాలని, ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానాలన్నీ అమలు చేయాలని డిమాండ్ చేశారు.