వేద న్యూస్, వరంగల్:

వనాలు, వన్యప్రాణుల రక్షణ, సహజవనరుల సంరక్షణ, పర్యావరణ విద్య, ప్రకృతి పరిరక్షణకు ఓరుగల్లు వైల్డ్ లైఫ్ సొసైటీ స్వచ్చంద సంస్థ చేసిన, చేస్తున్న సేవలను గుర్తిస్తూ .. 2025 సంవత్సరానికి గాను ఉగాది పురస్కారాన్ని మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ భాస్కర్ బృందం  హనుమకొండ లోని వారి పార్టీ ఆఫీసులో అందజేశారు.

ప్రకృతి, పర్యావరణం, అటవీ, సహజవనరుల సంరక్షణ సేవ చేయడం చాలా గర్వంగా సంతోషంగా ఉన్నదని ఈ సందర్భంగా OWLS స్వచ్చంద సంస్థ వరంగల్, వ్యవస్థాపక అధ్యక్షుడు ఇందారం నాగేశ్వరరావు పేర్కొన్నారు. తమ సంస్థ సభ్యులందరికీ ఆ అవార్డును అంకితం చేస్తున్నామని తెలిపారు. 

వనాలు, వన్యప్రాణుల రక్షణలో ప్రజలు కలిసిరావాలని పిలుపునిచ్చారు. తమ ప్రయాణంలో మరిన్ని విజయాలు సాధించడానికి అందరి నుంచి మద్దతును ఆశిస్తున్నామని వెల్లడించారు. “టార్చ్ సంస్థ” వ్యవస్థాపకులు, అధ్యక్షుడు అరవింద్ ఆర్యా పకిడె కు ప్రత్యేక వినమ్ర కృతజ్ఞతలు తెలిపారు.  ఇదే సందర్బంగా వివిధ విభాగాలలో “ఉగాది పురస్కారాలు” పొందిన ఇతర గ్రహీతలందరికీ హృదయపూర్వక అభినందనలు తెలిపారు.