వేద న్యూస్, జమ్మికుంట:

 గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే పవిత్ర లక్ష్యంతో హరి హర క్షేత్రం నర్సింగాపూర్ పోషక సమితి ట్రస్ట్ గ్రూప్ ఆధ్వర్యంలో ట్రస్ట్ సభ్యులు పత్తి దిలీప్ రెడ్డి, సరోత్తం రెడ్డి కుమారుడు వారి సహకారంతో..వేద కంటి, చెవి ముక్కు గొంతు వైద్య ఆసుపత్రి సౌజన్యంతో చేపట్టిన ఉచిత వైద్య శిబిరం విజయవంతం అయింది.

కరీంనగర్ జిల్లా వీణవంక మండలం నర్సింగాపూర్ గ్రామంలో ఆదివారం ఉదయం ఏడు గంటల నుండి మధ్యాహ్నం మూడు గంటల వరకు ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించిన క్యాంపు నకు ప్రజలు హాజరయ్యారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణే లక్ష్యంగా నర్సింగాపూర్‌ గ్రామం లో ఉచిత వైద్య శిబిరం చేపట్టినట్టు నిర్వాహకులు, వైద్యులు తెలిపారు.

అప్తల్మీక్ పేషెంట్ లు 180మంది, ఈ ఎన్ టి పేషెంట్ లు 120 మంది క్యాంపునకి వచ్చారు. 80 మందికి ఉచితంగా కళ్ళ జోడు లు , అందరికీ కంటి, చెవి చుక్కల మందులను పంపిణీ చేశారు.

కార్యక్రమంలో నేత్ర వైద్య నిపుణులు డాక్టర్ టి.వెంకట్ సాయి నేత్ర ఎంబీబీఎస్ ఎంఎస్(ఆప్తమాలజీ), చెవి, ముక్కు, గొంతు వైద్య నిపుణులు డాక్టర్ ఎస్.నిఖిత దంపతులు , డాక్టర్ టి సురేష్ బాబు, గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, ప్రజలు పాల్గొన్నారు.