వేద న్యూస్ పాపన్నపేట రిపోర్టర్ దయానంద్
పాపన్నపేట మండలం లోని పాలు గ్రామాలు అభివృద్ధి నా దెయ్యం
జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షులు బైండ్ల సత్యనారాయణ
పాపన్నపేట మండల పరిధిలోని ఆయా గ్రామాలలో అభివ్రుద్ది పనులను మంజూరు చేయాలని కోరుతూ బుధవారం రోజు మెదక్ జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షులు బైండ్ల సత్యనారాయణ ముదిరాజ్ ఆధ్వర్యంలో మెదక్ ఎంపీ రఘునందన్ రావును హైద్రాబాద్ లోని ఆయన నివాసంలో మర్యాద పూర్వకంగా కలిసి పాపన్నపేట మండల పరిధిలోని సిసి రోడ్డు,సైడ్ డ్రైన్స్,స్ట్రీట్ లైట్స్, అభివ్రుద్ది కార్యక్రమాల గురించి మాట్లాడారు.ఈ సందర్భంగా ఎంపీ సానుకూలంగా స్పందించినట్లు సత్యనారాయణ స్పష్టం చేశారు.ఎంపీనీ కలిసిన వారిలో నార్సింగి గ్రామ బిఆర్ఎస్ సర్పంచ్ దారబోయిన మల్లేశం, నార్సింగి ఉప సర్పంచ్ శ్రీరాం నరేష్,బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి,కొడపాక బుల్లెట్, దుర్గా ప్రసాద్, ఎస్టీ మోర్చా మండల అధ్యక్షులు వెంకట్, తదితరులు కలిసిన వారిలో ఉన్నారు.
