వేద న్యూస్, వరంగల్:

‘వేద న్యూస్’ తెలుగు దినపత్రిక ప్రచురించిన కథనానికి స్పందన వచ్చింది. ఈ ఏడాది అక్టోబర్ 5న ‘అగో ఇదేంది.. తెలంగాణలో ఆంధప్రదేశ్ ప్రభుత్వ ఆస్పత్రి’ శీర్షికన వార్తా కథనం ప్రచురితం కాగా, దానికి స్పందన వచ్చింది. 

వరంగల్ ఆటోనగర్ లోని ప్రాంతీయ నేత్ర వైద్యశాల బోర్డుపై “ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం” అని రాసి ఉండటం చూసి స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేసిన సంగతిని ‘వేద న్యూస్’ ప్రస్తావించింది. 

తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉన్నదా? అనే అనుమానాలను వ్యక్తం చేస్తున్నారని వెల్లడించారు. ఈ నేపథ్యంలో తాజాగా సదరు ఆస్పత్రి వారు స్పందించారు. బుధవారం ప్రాంతీయ నేత్ర వైద్యశాల బోర్డుపై “ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం” అని రాసి ఉన్న చోట తెలుపు రంగు వేయించారు.  రీజినల్ గవర్నమెంట్ ఐ హాస్పిటల్ వరంగల్ అని మాత్రమే అని కనిపించేలా చేశారు. కాగా, ‘‘తెలంగాణ ప్రభుత్వం’’ అని ఆ తెలుపు రంగు స్థానంలో రాయించాలని స్థానికులు సూచిస్తున్నారు. 

 

 

 

 

 

 

 

 

 

 

 

అగో.. ఇదేంది.. తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆసుపత్రి?