వేద న్యూస్, హుజురాబాద్ ప్రతినిధి/కమలాపూర్:
“వేద న్యూస్” కథనానికి స్పందన వచ్చింది. వేద న్యూస్ తెలుగు దినపత్రిక ప్రధాన సంచికలో శుక్రవారం “హాస్టల్ సీటు ఇప్పించరూ!” శీర్షికన .. ప్రముఖంగా ప్రచురించిన కథనానికి వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ ముత్తినేని వీరయ్య స్పందించారు. నిరుపేద విద్యార్థిని పాఠశాలకు వెళ్లేందుకు పడుతున్న కష్టాన్ని.. పేదరికంలో ఉన్న సందర్భాన్ని “వేద న్యూస్” తన కథనంలో వివరించంది.
4 కిలోమీటర్లు కుంటుతూ.. స్కూలుకు నడిచి వెళుతున్న విద్యార్థిని సబ్జాన్ బి కి.. హాస్టల్లో సీటు ఇప్పించాలని జిల్లా సంక్షేమ శాఖ అధికారి కి వీరయ్య చెప్పారు. ఈ బాధ్యతను కాంగ్రెస్ పార్టీ వికలాంగుల శాఖ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు బొట్ల సురేష్ కు అప్పజెప్పారు.