వేద న్యూస్, ఆసిఫాబాద్:

బడికి వెళ్లే బాట అధ్వానంగా ఉందని రహదారిపై ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ధర్నాకు దిగారు. వివరాల్లోకి వెళితే..కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ మండలం అందేవెల్లి గ్రామం పాఠశాలకు వెళ్లేందుకు మార్గం బాగాలేదని, బురద నీటిని దాటుకొని వెళ్లే దుస్థితి ఉందని స్టూడెంట్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

అధికారులకు, ప్రజా ప్రతినిధులకు ఎన్ని సార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రతిరోజు మురుగునీటిని దాటుకుంటూ.. బురదమయమైన దారి వెంట పాఠశాలకు వెళ్లాలంటే ఇబ్బంది కలుగుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అధికారులు వెంటనే స్పందించాలని, తగు చర్యలు వెంటనే చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. వర్షాకాలం నేపథ్యంలో.. వానలు విపరీతంగా కురిస్తే తమ పాఠశాలకు వెళ్లలేక పోతామని వెల్లడిస్తున్నారు.