- తహసిల్దార్ కార్యాలయానికి ప్రహరీ నిర్మాణం పూర్తి
- రూపురేఖలే మారిన తహసిల్దార్ కార్యాలయం
- ప్రారంభానికి సిద్ధం
- వేద న్యూస్ పత్రికా కథనానికి స్పందించిన కలెక్టర్,సబ్ కలెక్టర్
వేద న్యూస్, నల్లగొండ ప్రత్యేక ప్రతినిధి :
తహసిల్దార్ పత్రాలకు భద్రత కరువు, ప్రహరీ నిర్మించేది ఎన్నడూ..? శీర్షిక న “వేద న్యూస్” పత్రిక ఇటీవల కథనాన్ని ప్రచురించింది. వేద న్యూస్ పత్రిక కథనానికి మిర్యాలగూడ సబ్ కలెక్టర్ అమిత్ నారాయణ స్పందించారు.
తహసిల్దార్ కార్యాలయంలో నెలకొన్న సమస్యలను తహసిల్దార్ హేమలతను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా తహసిల్దార్ సమస్యలను సబ్ కలెక్టర్ కు వివరించారు. వెంటనే ప్రహరీ నిర్మాణం కోసం 5 లక్షల రూపాయలు మంజూరు చేశారు. ప్రహరీ నిర్మాణం కు సర్దుబాటు కాకుంటే ఇంకా మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.
వెంటనే తహసిల్దార్ ప్రహరీ నిర్మాణ పనులను ప్రారంభించారు.రెండు నెలల్లోనే ప్రహరీ గోడ నిర్మాణం పూర్తి చేశారు. దీంతో తహసిల్దార్ కార్యాలయం రూపురేఖలే మారిపోయాయి.ఈ సందర్భంగా మండల ప్రజలు, రైతులు, ప్రజాప్రతినిధులు సైతం తహసిల్దార్ హేమలతకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.
” వేద న్యూస్” పత్రిక ప్రజల సమస్యలు ప్రభుత్వం,అధికారుల దృష్టికి తీసుకపోవడంలో ముందువరసలో నిలిచిందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
