వేద న్యూస్, బ్యూరో:
ఈ నెల 16న కృష్ణాష్టమి వేడుకలను ప్రతిఒక్కరూ అత్యంత వైభవోపేతంగా నిర్వహించుకోనున్నారు. ముఖ్యంగా చిన్నారులను శ్రీకృష్ణుడు, గోపికల మాదిరిగా వేషధారణలో అలంకరించి.. హాయిగా.. ‘‘రేపల్లే వాడు, గోపాలుడు, గోపిక’’ అంటూ.. పాటలు పాడిస్తూ.. పాటలకు నృత్యం చేయిస్తూ సంబురపడుతుంటారు. ఈ క్రమంలోనే ‘వేద న్యూస్’ తెలుగు దినపత్రిక చక్కటి అవకాశాన్ని ప్రజలకు ఇస్తోంది.
కృష్ణుడు, గోపికల వేషధారణలో ఉన్న చిన్నారుల ఫొటోలను ‘వేద న్యూస్’ కు పంపిస్తే.. చక్కటి ఫొటోలను సెలక్ట్ చేసి శ్రీకృష్ణజన్మాష్టమి నాడు ‘వేద న్యూస్’ తెలుగు దినపత్రికలో ప్రచురించనుంది. ప్రజలు తమ చిన్నారుల పేరు, ఊరుతో పాటు సుందరమైన ఫొటోలను 97019 20379 నంబర్‌కు పంపించగలరు. ఫొటోల ఎంపికలో ‘వేద న్యూస్’ టీమ్‌దే ఫైనల్ డెసిషన్‌గా ఉండనుంది.